శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా వస్తున్న సినిమా హాయ్ నాన్న. పాధర్ అండ్ డాటర్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో నాని తండ్రి పాత్రలో నటించబోతున్నాడు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక ఈసినిమా మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. రీసెంట్ గానే ఈసినిమా నుండి సమయమా అనే సాంగ్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ పాటకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మరో పాటను రిలీజ్ చేయడానికి సిద్దమయ్యారు మేకర్స్. ఈనేపథ్యంలోనే దీనికి సంబంధించిన అప్ డేట్ ను చిన్న వీడియో రిలీజ్ చేస్తూ తెలిపారు. ఈ వీడియోలో పాప నాన్న మనది లవ్ స్టోరీ ఆ అని అడుగగా..అవును లవ్ స్టోరీ నే అని చెబుతాడు.. ఇది మన స్టోరీ కాదా అని మళ్లీ పాప అడుగగా మన స్టోరీ కూడా అంటాడు.. మరి నీ లవ్ సాంగ్ ను నువ్వు రిలీజ్ చేసుకున్నావు..మన సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తావు అనగా.. మన సాంగ్ నా గాజు బొమ్మ.. రెడీ నా అంటూ అక్టోబర్ 6వ తేదీన ఈపాటను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
The musical story of #HiNanna gets deeper ♥️
The Soul of #HiNanna – #GaajuBomma striking on October 6th ✨
Ready ah??
Natural🌟 @NameIsNani #MrunalThakur @shouryuv #BabyKiara @HeshamAWMusic @SJVarughese @mohan8998 @drteegala9 @kotiparuchuri @VyraEnts @TSeries @TseriesSouth pic.twitter.com/lmZ8231345
— Vyra Entertainments (@VyraEnts) October 3, 2023
ఇక ఈసినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. నాని కూతురిగా బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రాఫర్ గా..హృదయం ఫేమ్‌కు చెందిన ప్రముఖ మలయాళ కంపోజర్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈసినిమాను డిసెంబర్ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































