కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. దానికి నిదర్శనమే రీసెంట్ గా బలగం సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు అదే కంటెంట్ బెేస్డ్ తో వస్తున్న సినిమా పెదకాపు. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను తీసి మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో తన రూటు మార్చాడు. వెంకీతో నారప్ప సినిమాను తీసి హిట్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు పెదకాపు అంటూ వచ్చేస్తున్నాడు. విరాట్ కర్ణ హీరోగా వస్తున్న ఈసినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా అందులో మొదటి పార్ట్ ఈనెల 29వ తేదీన రిలీజ్ కాబోతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుండగా.. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు మొదటిపెట్టి వరుసగా అప్ డేట్లు ఇస్తూ మంచి బజ్ ను క్రియేట్ చేశారు. టీజర్, పాటలు సినిమాపై మంచి అంచనాలను పెంచేశాయి. ఇప్పుడు ట్రైలర్ తో వచ్చేశారు. తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ మరింత ఆకట్టుకుంటుంది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచేలా కనిపిస్తున్నాయి. ఊరిలో రాజకీయాలు, ఆదిపత్య పోరాటాలు, వాటిని ఎదురించి ధైర్యంగా పోరాటానికి సిద్దమైన ఓ సాధారణ యువకుడు.. ఈ అంశాలతో సినిమాను రూపొందించాడు శ్రీకాంత్. విరాట్ కర్ణ నటన కూడా ఈసినిమాకు ప్లస్ పాయింట్ అయ్యేలా కనిపిస్తుంది. శ్రీకాంత్ అడ్డాల కూడా సర్ ప్రైజింగ్ అప్పీరెన్స్ ఇచ్చాడు. మొత్తానికి రా అండ్ రస్టిక్ గా ఉన్న ఈ ట్రైలర్ చూస్తుంటే హిట్ కొట్టేలానే కనిపిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:
































