కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా నటించిన కొత్త చిత్రం ‘జవాన్’. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ పై ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మంగళవారం కొత్త సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ అనే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. కాగా రీసెంట్ గా #AskSRK సెషన్ లో షారూఖ్ ఖాన్ తన అభిమానులతో సినిమాకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా.. షారుఖ్, ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ సాంగ్ గ్లింప్స్ ను విడుదల చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దీంతో ఈ చిత్రంలోని మూడో సాంగ్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూడసాగారు. ఎట్టకేలకు ఈ నిరీక్షణకు తెరపడుతూ ‘నాట్ రామయ్యా వస్తావయ్యా..’ సాంగ్ మంగళవారం సాయంత్రం విడుదలైంది. ఇక ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లు ‘నాట్ వస్తావయ్యా’ను అద్భుతంగా తెరకెక్కించారు. పాట చూస్తుంటే పార్టీ నెంబర్ లా ఉంది. ప్రోమోలో షారూఖ్ ఎనర్జీ, ఛార్మ్ అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు సాంగ్ లో అది రెట్టింపుగా కనిపిస్తుంది. డాన్స్ మూవ్స్ ట్రెండ్ సెట్టింగ్ గా ఉన్నాయి. పాటను హిందీ, తెలుగు, తమిళ భాషల్లో మేకర్స్ విడుదల చేశారు. సాంగ్ పార్టీ వైబ్స్ తో అలరిస్తుంది. హిందీ వెర్షన్ లో ‘నాట్ రామయ్యా వస్తావయ్యా’ పాటకు అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. పాటకు కుమార్ సాహిత్యాన్ని అందించారు.
అనిరుధ్, విశాల్ డడ్లాని, శిల్పారావు పాటను తమదైన స్టైల్లో అద్భుతంగా ఆలపించారు. వైభవ్ మర్చంట్ పాటకు కొరియోగ్రఫీని అందించారు. తెలుగు వెర్షన్ పాటను ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ రాయగా శ్రీరామచంద్ర, రక్షిత సురేష్, అనిరుద్ పాడారు. ఇక తమిళ వెర్షన్ సాంగ్ కు వివేక్ సాహిత్యాన్ని అందించారు. అనిరుద్, శ్రీరామ్ చంద్ర, రక్షిత సురేష్ పాటను పాడారు. షారూఖ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ‘జవాన్’ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. గౌరవ్ వర్మ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సెప్టెంబర్ 7న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా హిందీ సహా తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అవుతోంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























