కంగువ గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

suriya kanguva movie glimpse release date fixed

తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటనతో కేవలం తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు మాత్రం విభిన్నమైన సినిమాలను మాత్రమే ఎంచుకుంటూ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాడు. ప్రస్తుతం అయితే తన నుండి వస్తున్న భారీ బడ్జెట్ సినిమా కంగువ. గత ఏడాది నుండి ఈసినిమా షూటింగ్ ను మొదలుపెట్టగా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణ జరుపుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా గ్లింప్స్ రిలీజ్ కు డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు మేకర్స్. జులై 23 వ తేదీన ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు.

కాగా హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌‌లో.. ఈ సినిమా 1000 సంవత్సరాల క్రితం జరిగిన కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో సూర్య సరసన దిశా పటాని హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాని స్టూడియో గ్రీన్ తో పాటు టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ సంస్థ యు.వీ క్రియేషన్స్ కూడా కలిసి నిర్మిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం 3డీ వర్షెన్‌లో 10 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. మరి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈసినిమా ఎన్ని సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.