గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రానుంది. ఈసినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈసినిమా నుండి ఇప్పటికే ప్రీ టీజర్ రిలీజ్ పేరుతో ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రీ టీజర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. స్టైలిష్ గా సూపర్ విజువల్స్ తో ప్రీ టీజర్ ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు టీజర్ ను రిలీజ్ చేయడానికి సిద్దమవుతున్నారు. ఈనేపథ్యంలోనే ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమా టీజర్ ను జులై 24వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.
ARMED & READY 😎
ARJUN is all set for an action-packed ride🔥Mega Prince @IAmVarunTej’s#GandeevadhariArjuna TEASER ON 24th JULY @ 10:08 AM 💥💥
Stay Tuned ❤️🔥 @sakshivaidya99 @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial @JungleeMusicSTH #GDAonAugust25th pic.twitter.com/xgVTL1v5u3
— SVCC (@SVCCofficial) July 19, 2023
కాగా యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈసినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని నాగబాబు సమర్పణలో శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్‌పై బీవిఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈసినిమాకు మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా.. ముఖేష్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























