పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో భారీ బడ్జెట్ తో వస్తున్న సినిమా ప్రాజెక్ట్ కే. ఈసినిమాను ప్రకటించిన దగ్గర నుండే సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ షూటింగ్ దశలో ఉంది. షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. మరోవైపు ఈసినిమా నుండి పలు ఇంట్రెస్టింగ్ వీడియోలు రిలీజ్ చేస్తూ క్యూరియాసిటీనిపెంచుతున్నారు. స్క్రాచ్ నుండి టైర్ ను తయారు చేయడం.. స్క్రాచ్ నుంచి రైడర్స్ లుక్ ని ఎలా ప్రిపేర్ చేస్తున్నారో తెలుపుతూ వీడియోలు రిలీజ్ చేయగా వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. జస్ట్ గ్లింప్సే ఈ రేంజ్ లో ఉంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ప్రస్తుతం ప్రాజెక్ట్ కే చిత్రయూనిట్ యూఎస్ఏ లో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే కదా. నేడు యూఎస్ఏ లో శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో ప్రాజెక్ట్ కే టీమ్ కూడా పాల్గొననున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే చిత్రయూనిట్ అక్కడకు చేరుకుంది. ఈనేపథ్యంలో ప్రభాస్ ఫుల్ స్టైలిష్ లుక్ లో ఎంట్రీ ఇచ్చారు. స్లిమ్ లుక్ లో ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటుంది. ఇక ప్రభాస్ లుక్ ను చూసి ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు.
Our Uber-Cool Darling #Prabhas makes a Stylish Entry at @comic_con, San Diego 🤩❤️#ProjectK #ComicCon #TeluguFilmNagar pic.twitter.com/j7N41mHObd
— Telugu FilmNagar (@telugufilmnagar) July 20, 2023
కాగా ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తుంది. మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్ తో ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తోట రమణి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: