ఇంట్రెస్టింగ్ గా జవాన్ ప్రివ్యూ

shah rukh khans jawan movie prevue released

ఇక ఈసినిమా కొత్త రిలీజ్ డేట్ ను రీసెంట్ గానే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. సెప్టెంబర్ 7వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇక ఈసినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేశారు మేకర్స్. ఈనేపథ్యంలోనే ఈసినిమా నుండి ప్రివ్యూ ను రిలీజ్ చేస్తామని ఇప్పటికే చిత్రయూనిట్ తెలిపిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక చెప్పినట్టే ఈసినిమా నుండి ప్రివ్యూ పేరుతో ఒక ఇంట్రెస్టింగ్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీడియో అయితే ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో విజువల్ గ్రాండ్ గా ఉంది. షారుఖ్ ఖాన్ క్యారెక్టర్‌ మిస్టరీ గా, చాలా పవర్ ఫుల్ గా ఉంది. మెట్రో రైలు సీక్వెన్స్ సినిమాకు హైలైట్ కానుందని వీడియో ను చూస్తే తెలుస్తోంది. విలన్ గా విజయ్ సేతుపతి మరింత పవర్ ఫుల్ గా చూపించబోతున్నట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ సినిమాతో అట్లీ బాలీవుడ్ లో మరో ప్రభంజనం సృష్టించడానికి రెడీ అవుతున్నట్టు అర్థమవుతుంది. టీజర్ అయితే సినిమాపై అంచనాలను పెంచేసింది. సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి.

కాగా ఈసినిమాలో షారుక్ రెండు డిఫరెంట్ పాత్రల్లో నటిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఒకటి ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌ పాత్రలో నటిస్తుండగా.. మరొకటి గ్యాంగ్‌స్టర్‌గా ద్విపాత్రాభినయం చేయనున్నట్టు సమాచారం. ఈసినిమాలోనయనతార హీరోయిన్ గా నటిస్తుండగా.. విజయ్ సేతుపతి, ప్రియమణి, యోగి బాబు, సునీల్ గ్రోవర్ కూడా పలు పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై గౌరీఖాన్‌ నిర్మించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వచ్చే ఏడాది జూన్‌ 2న రిలీజ్‌ చేయనున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.