పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా బ్రో. ఈసినిమా తమిళ్ లో హిట్ అయిన వినోదయసితం అనేే సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఫాంటసీ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇప్పుడు ఈసినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. ఈసినిమా నుండి వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలను అంతకంతకూ పెంచేస్తుంది. పవన్ ఫస్ట్ పోస్టర్ నుండే సినిమాకు హైప్ రాగా అక్కడ నుండి ఈసినిమా నుండి రిలీజ్ చేసిన ప్రతి పోస్టర్ అలానే టీజర్ అంచనాలను భారీగా పెంచేశాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మ్యూజికల్ ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ మైడియర్ మార్కండేయ అనే పాటను రిలీజ్ చేయగా ఆ పాటకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూస్తున్నాం. ఇక మిగిలిన పాటలు కూడా ఇదే రేంజ్లో ఉండబోతున్నట్టు అర్థమైంది. ఈనేపథ్యంలోనే థమన్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తికరంగా మారాయి. తాజాాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న థమన్ ఈసినిమాలో టైమ్ బేస్ తో ఓ ప్రమోషన్ సాంగ్ ఉంటుంది…అది చాలా మ్యాజికల్ గా ఉంటుంది అంటూ సాంగ్ పై క్యూరియాసిటీని పెంచేశాడు. మరి చూద్దాం ఆపాట ఎలా ఉండబోతుందో
ఈసినిమాలో హీరోయిన్ గా కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, ప్రియా ప్రకాష్ వారియర్, రాజా చెంబోలు పలు కీలకపాత్రల్లో నటించనున్నారు. కాగా కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమాకు టీజీ విశ్వప్రసాద్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకు డైలాగులు స్క్రీన్ ప్లే.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: