మెగాస్టార్ చిరు స్పీడు మాత్రం ఎక్కడా తగ్గేలా కనిపించడంలేదు. ఒకపక్క సినిమాలు రిలీజ్ చేసేస్తున్నాడు. షూటింగ్ లు కంప్లీట్ చేసేస్తున్నాడు. మరోపక్క కొత్త సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ప్రస్తుతం చిరంజీవి నుండి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా భోళాశంకర్. మెహర్ రమేష్ దర్శకత్వంలో ఈసినిమా రానుంది. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అయినా కూడా ఇక్కడి ప్రేక్షకులకు తగ్గట్టు సినిమాను చిత్రీకరించినట్టు తెలుస్తుంది. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ తో బిజీగా ఉంది. ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేయగా టీజర్ అయితే మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈసినిమా రీసెంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అంతేకాదు చిరు కూడా ఇప్పటికే తన డబ్బింగ్ ను పూర్తి చేసేసుకున్నాడు. ఇక ఇదిలా ఉండగా భోళా శంకర్ సినిమా పనులు పూర్తవడంతో చిరు వెకేషన్ కు చెక్కేశారు. ఈనేపథ్యంలో తాజాగా అందుకు సంబంధించిన అప్ డేట్ ఇచ్చాడు చిరు. రీఫ్రెష్ కోసం సతీమణి సురేఖ తో కలిసి యూఎస్ వెళుతున్నానని.. వచ్చిన తరువాత తన కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అవుతానని తెలిపారు. అంతేకాదు నెక్ట్స్ సినిమా హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని కూడా తెలియచేశారు. ఈసినిమాను గోల్డ్ బాక్స్ ఎంటర్ టైనర్ వారు ప్రొడ్యూస్ చేస్తున్నట్టు కూడా పోస్ట్ లో పేర్కొన్నాడు.
Off to US on a short holiday with Surekha to refresh and rejuvenate before I join the shoot of my next, a hilarious family entertainer being produced by @GoldBoxEnt ! pic.twitter.com/rWTihORaWZ
— Chiranjeevi Konidela (@KChiruTweets) July 7, 2023
కాగా ఈసినిమాలో చిరు కి చెల్లెలిగా కీర్తి సురేష్ నటిస్తుంది. ఈసినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. వీరితో పాటు రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రష్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శ్రీను ఉన్నారు.ఇక ఈసినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. సంగీతం మహతి సాగర్.. సినిమాటోగ్రఫి డూడ్లే అందిస్తున్నారు. ఈసినిమా ఆగష్ట్ 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























