సామజవరగమన ఫస్ట్ వీక్ బ్లాస్టింగ్ కలెక్షన్స్

sree vishnu samajavaragamana first week word wide collections

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విభిన్నమైన సినిమాలు, ప్రయోగాలు చేయడంలో ఎప్పుడూ ముందుంటాడు. ఇక చాలా కాలంగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న శ్రీవిష్ణుకు సామజవరగమన సినిమాతో అది నెరవేరింది. శ్రీవిష్ణు హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన సినిమా సామజవరగమన. ఈసినిమా ఫస్ట్ షో నుండే మంచి టాక్ ను సొంతం చేసుకుంది. మంచి ఫ్యామిలీ ప్లస్ కామెడీ ఎంటర్ టైనర్ గా టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. కేవలం మౌత్ టాక్ తోనే ఈసినిమా ప్రేక్షకుల ఆదరణను పొందింది. తాజాగా బన్నీ కూడా ఈసినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని సర్టిఫికెట్ కూడా ఇచ్చాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈనేపథ్యంలో ఈసినిమా కలెక్షన్స్ ను కూడా సాలిడ్ గా రాబట్టుకుంటుంది. ఈసినిమా మొదటి రోజు 2.89కోట్లను రాబట్టుకుంది. అయితే మంచి టాక్ రావడంతో రెండో రోజు ఏకంగా 4 కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. రెండు రోజుల్లోనే ఈసినిమా 6 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది. అలా రోజు రోజుకు కలెక్షన్స్ ను పెంచుకుంటూనే పోయింది. ఇక ఈసినిమా రిలీజ్ అయి వారం రోజులు అయిపోయింది. ఈ వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది.

కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్‌, నరేశ్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్‌ టైన్‌ మెంట్‌ బ్యానర్‌, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.