దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత రాజమౌళికే చెందుతుంది అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గ్లోబల్ లెవల్ కి మన ఇండస్ట్రీని తీసుకెళ్లి ప్రపంచం మొత్తం టాలీవుడ్ ను వైపు చూసేలా చేశాడు. అంతర్జాతీయ స్థాయి నటులు కూడా మన హీరోలతో చేయాలని ఉందని చెబుతున్నారంటేనే అర్థంచేసుకోవచ్చు. ప్రస్తుతం మరో చరిత్ర తిరగరాసే సినిమా కోసం రెడీ అవుతున్నాడు రాజమౌళి. తన కొత్త సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయనున్న సంగతి తెలిసిందే కదా. ఫారెస్ట్ అడ్వెంచరస్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈసినిమా కోసం సాలిడ్ కథను తయారు చేసే పనిలో ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఇప్పుడు మరో కొత్త రోల్ ను ప్లే చేయనున్నారు. అయితే ఏదో సినిమాలో నటిస్తున్నాడు అనుకుంటున్నారా? అసలు సంగతేంటంటే.. ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ISBC) చైర్మన్గా రాజమౌళి కొత్త బాధ్యతలు నిర్వహించనున్నారు. గ్రామీణ స్థాయి నుంచి క్రికెటర్స్గా ఎదగాలనుకునే వారిని గుర్తించి.. వారిలోని ప్రతిభను ప్రోత్సహించేందుకు గాను మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్ సర్కార్
ఇండియన్ స్కూల్స్ బోర్డ్ ఫర్ క్రికెట్(ISBC) అనే సంస్థను ఏర్పాటు చేశారు. ప్రతిభ ఉండి సదుపాయాలు లేని ఆటగాళ్లకు ఈ సంస్థ అండగా నిలవబోతుంది. ఈనేపథ్యంలో చైర్మన్గా రాజమౌళిని ఎంపిక చేశారు. మరి రాజమౌళి సంగతి తెలిసిందే.. దేనిలో అయినా పర్ఫెక్షన్ కోరుకుంటాడు.. ఇప్పుడు క్రికెట్ లో ఎంతమంది జెమ్స్ ను బయటకు తీస్తాడో చూడాలి..
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:

































