మంగళవారం టీజర్ రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్

ajay bhupathi mangalavaaram movie teaser release date fixed

ఆర్ఎక్స్ 100 సినిమాతో డైరెక్టర్ గా సినీ ఇండస్ట్రీలో అరంగేట్రం చేశాడు అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే డైరెక్టర్ గా మంచి గుర్తింపును పొందాడు. ఈ మూవీ ని తెరకెక్కించిన విధానానికి అజయ్ భూపతికి విమర్శకుల నుండి ప్రశంసలు సైతం లభించాయి. ఆతరువాత మహా సముద్రం సినిమాతో వచ్చాడు కానీ ఆసినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు మూడో సినిమాతో హిట్ కొట్టాలని వచ్చేస్తున్నాడు. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో మంగళవారం అనే డిఫరెంట్ టైటిల్ తో తన మూడో సినిమా చేస్తున్నాడు. గ్రామీణ నేపథ్యంలో 1990లలో సాగే కథతో డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీస్తున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈసినిమా రీసంట్ గానే షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీ అయిపోయింది. ఇక తాజాగా ఈసినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు. ఈసినిమా టీజర్ ను జులై 4వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ మరి తెలిపారు.

కాగా ఈసినిమాతో అజయ్ భూపతి నిర్మాతగా కూడా మారుతున్న సంగతి తెలిసిందే. ఏ క్రియేటివ్ వర్క్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించి దీనికి ఒక నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా కాంతార సెన్సేషన్ అజనీష్ లోక్ నాథ్ పనిచేయనున్నారు. తెలుగుతో పాటు కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. మరి అజయ్ తనకు కలిసొచ్చిన హీరోయిన్ పాయల్ తో మరోసారి హిట్ కొడతాడేమో చూడాలి.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 19 =