ఆర్ఆర్ఆర్ సినిమా సినిమా స్థాయి అంతర్జాతీయంగా ఎంత పెరిగిందో చూశాం. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రల్లో స్వాతంత్య్ర సమరయోధులు కొమురం భీమ్ ఇంకా అల్లూరి సీతారామరాజు జీవితచరిత్ర ఆధారంగా ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వచ్చింది. ఈసినిమా గత ఏడాది రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఇక ఇక్కడ మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈసినిమా పలు సంచలనాలు సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా కీర్తి గణించాడు. ఈసినిమా ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. అంతేకాదు భారతీయ సినిమా ఖ్యాతిని ఆర్ఆర్ఆర్ చిత్రం ఆస్కార్ వేదిక వరకూ తీసుకెళ్లింది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డును గెలుచుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక మరోసారి ఆర్ఆర్ఆర్ టీమ్ కు అరుదైన గౌరవం దక్కింది. తాజాగా అకాడమీ వారు తమ ఆస్కార్ జ్యూరీలో మొత్తం 398 మంది కొత్త సభ్యులకి చోటు కల్పిస్తూ ప్రకటించింది. అయితే ఈ సభ్యులలో ఆర్ఆర్ఆర్ టీమ్ సభ్యులకు కూడా చోటు దక్కడం విశేషం. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు 6గురికి చోటు దక్కడం గొప్ప విషయం. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో పాటుగా ఎం ఎం కీరవాణి చంద్రబోస్, సెంథిల్, సాబు సెరిల్ స్థానం దక్కించుకున్నారు. దీంతో వారికి సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
ఈసినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో, అలానే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించారు. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటించగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటించింది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి, రాహుల్ రామకృష్ణ నటించారు. డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ పతాకం పై దానయ్య ఈ సినిమాని నిర్మించగా. ఈ చిత్రానికి కీరవాణి సంగీతం.. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫి అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: