టాలీవుడ్ టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు నుండి సినిమా వస్తుందంటే మినిమం గ్యారెంటీ అనే పేరును అయితే సొంతం చేసుకున్నాడు. దానికి కారణం తను ఎంచుకునే కథలు.. చేసే పాత్రలే. గత ఏడాది అల్లూరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శ్రీ విష్ణు ఇప్పుడు మరో సినిమాతో వచ్చేశాడు. రామ్ అబ్బరాజు దర్శకత్వంలో శ్రీవిష్ణు హీరోగా తెరకెక్కిన సినిమా సామజవరగమన. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రిలీజ్ కి ముందు నుండీ మంచి హైప్ ను సొంతం చేసుకుంది ఈసినిమా. ఇక ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా నేడు రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే కదా. రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే మంటి టాక్ ను సొంతం చేసుకుంది. కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ప్రేక్షకులు కూడా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈసినిమా విజయంతో శ్రీవిష్ణు కూడా చాలా కాలంగా వైయిట్ చేస్తున్న హిట్ ను అందుకున్నాడు. ఈనేపథ్యంలో శ్రీవిష్ణు ఈసినిమాకు వస్తున్న రెస్పాన్స్ పై తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశాడు. సామజవరగమన సినిమాపై మీరు చూపిస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ కి, అపారమైన ప్రేమ కు కృతజ్ఞతలు. ఈ చిత్రాన్ని ఫన్ టాస్టిక్ బ్లాక్ బస్టర్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు.
Your love and appreciation for our film #Samajavaragamana have left us feeling immensely grateful🤩🤗
Thank you each and everyone for your support and encouragement 🙏
It means the world to us ❤️🔥#FUNtasticBlockbuster pic.twitter.com/NNIWIMAHaj— Sree Vishnu (@sreevishnuoffl) June 29, 2023
కాగా ఈసినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్గా నటించగా.. ఇంకా వెన్నెల కిశోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్, హాస్య మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించగా.. గోపీ సుందర్ ఈసినిమాకు సంగీతం అందించారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: