కమెడియన్ వేణు దర్శకుడిగా మారుతూ వచ్చిన సినిమా బలగం. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈసినిమా ఈసినిమా మానవ సంబంధాలు, కుటుంబ విలువలు కథాంశంతో తెరకెక్కించడంతో సినిమా అందరికీ కనెక్ట్ అయింది. ఒకే జోనర్ కు పరిమితం కాకుండా అందరూ ఈసినిమాను ఆదరించడంతో చిన్న సినిమా అయినా కూడా అంత పెద్ద విజయం సాధించింది. అంతేకాదు ఈసినిమాను చూసి విడిపోయిన కుటుంబాలు కూడా కలిసిపోయాయంటేనే అర్థంచేసుకోవచ్చు ఈసినిమా ఎంత ప్రభావం చూపించగలిగిందో. కేవలం ఇక్కడ మాత్రమే కాదు అంతర్జాతీయంగా కూడా తన సత్తా చాటి అవార్డులు కొల్లగొట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమాపై ఇప్పటికే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు స్పందించి ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే కదా. ఇప్పుడు తాజాగా న్యాచురల్ స్టార్ నాని కూడా స్పందించాడు. ఇంత మంచి సినిమాని నేను ఆలస్యంగా చూశానంటే నమ్మలేకపోతున్నా.. చాలా కాలంగా తెలుగు సినిమాకి దక్కిన అర్హత కాదా?. ఈ క్లాసిక్‌కి ప్రాణం పోసిన మీరంతా నా హృదయంలో ఉన్నారు అంటూ సినిమాపై ప్రశంసలు కురిపించారు.
Can’t believe I have watched it this late. #Balagam
Isn’t this what telugu cinema deserved from a long time?
Thank you @VenuYeldandi9 , Raju gaaru and entire team.
Thank you @PriyadarshiPN , Kavya, Komarayya and family and every actor who breathed life in to this classic.
You…— Nani (@NameisNani) June 20, 2023
ఇక ఈ ఏడాది దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్నాడు నాని. ప్రస్తుతం శౌర్యవ్ దర్శకత్వంలో నాని ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నాని 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈసినిమా తెరకెక్కుతుంది. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతుంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈసినిమాను వైరా ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సి.వి.మోహన్, డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కె.ఎస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























