టాలెంటెడ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో, ప్రముఖ జానపద గాయని నాగదుర్గ హీరోయిన్గా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’ . సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్ పతాకాలపై సుకుమార్, బన్నీ వాస్, తబితా సుకుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టీజర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితం విడుదలచేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
గ్రామీణ నేపథ్యంలో సాగే పూర్తి స్థాయి వినోదాత్మక, కుటుంబ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పెళ్లి చూపులు, కుటుంబ బంధాలు, ప్రేమ వంటి అందమైన క్షణాలతో ప్రారంభమయ్యే ఈ కథ, ఆ తర్వాత ఊహించని మలుపులతో విడాకుల పత్రాల చుట్టూ తిరుగుతుందనే విషయాన్ని టీజర్ ద్వారా స్పష్టం చేశారు.
వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న ప్రియదర్శి, జానపద పాటలతో ఎంతో పాపులర్ అయిన నాగదుర్గను ఈ సినిమా ద్వారా నటిగా పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని ‘శ్రీలత’, ‘బారాత్ బీట్’, ‘గడప’ వంటి పాటలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ కాగా, తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























