మారెమ్మ ట్రైలర్ అద్భుతంగా ఉంది – శివ నిర్వాణ

Maremma Trailer Is Amazing says Siva Nirvana

మాస్ మహారాజా రవితేజ సోదరుడి తనయుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ విలేజ్ యాక్షన్-డ్రామా ‘మారెమ్మ’తో హీరోగా పరిచయం అవుతున్నారు. మంచాల నాగరాజ్ దర్శకుడిగా పరిచయం అవుతుండగా, మోక్ష ఆర్ట్స్ సంస్థ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. మయూర్ రెడ్డి బండారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్, పాటలు కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సెప్టెంబర్ 10 ఈ చిత్రం ప్రేక్షకులు ముందుకు వస్తోంది. తాజాగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు దర్శకుడు శివ నిర్వాణ హాజరయ్యారు. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ట్రైలర్ ని డిజిటల్ గా లాంచ్ చేశారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ: అందరికీ నమస్కారం. మాధవ్ తో రవితేజ గారి ‘ఇరుముడి’ జర్నీ మొదలైనప్పటి నుంచే పరిచయం అయింది. షూటింగ్ సమయంలో అల్యూమినియం ఫ్యాక్టరీలో మాధవ్‌ను కలిశాను. నాకు అప్పుడు ‘మారెమ్మ’ సినిమా చేస్తున్నానని చెప్పాడు. తను చెప్పినప్పుడు మేము ‘ఇరుముడి’ కోసం లొకేషన్స్ చూస్తున్నాం. మొదటి చూసిన  లోకేషన్ ‘మారెమ్మ’ గుడి. ‘ఇరుముడి’లో ‘కట్టు కట్టు’ సాంగ్ ఆ టెంపుల్ బ్యాక్‌గ్రౌండ్‌లోనే చేశాం. ‘మారెమ్మ’ టీజర్‌ను చూపించాడు. చాలా ఇంటెన్సిటీ ఉంది. నిజానికి ఒక డెబ్యూ హీరో తొలి సినిమా చేస్తున్నప్పుడు పాటలు, ఫైట్లు అన్నీ ప్రూవ్ చేసుకోవాలని ఉంటుంది. ఒక ప్రేమకథతో రావాలి అనుకుంటారు. కానీ అవన్నీ కాకుండా ఒక మంచి కంటెంట్ బేస్డ్ సినిమాని తను ఎంపిక చేసుకోవడం పట్ల నేను తనని అభినందిస్తున్నాను. తను నిజాయితీగా దర్శకుడు చెప్పిన కథను నమ్మి ఈ ప్రయత్నం చేశాడు. ఫస్ట్ సినిమాకే ఇంత హార్డ్ కంటెంట్‌ను ఎంచుకోవడం మామూలు విషయం కాదు. ట్రైలర్ చాలా అద్భుతంగా కట్ చేశారు. ట్రైలర్‌లో కథను ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా చాలా అద్భుతంగా చెప్పారు.

ఈ కథలో ఉన్న ఇంటెన్సిటీ, మ్యూజిక్, ఫోటోగ్రఫీ చాలా బాగున్నాయి. కథకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్తే ప్రతి కథ ఒక బ్లాక్‌బస్టర్ అవుతుంది. సినిమా బ్లాక్‌బస్టర్ కావడానికి ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. దీప చాలా నేచురల్ గా ఉన్నారు. నిర్మాతలు కంటెంట్‌ను నమ్మి ఈ సినిమా చేశారు. ఈ ప్రయత్నం విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో నటించిన నటీనటులందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అందరూ ఈ సినిమాని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ 10న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతుంది. అందరూ థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.