సూపర్‌స్టార్ మహేష్ బాబు, అగ్ర దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో గ్లోబ్‌ట్రాటింగ్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘వారణాసి’. ఈ సినిమా షూటింగ్ ఏ స్టేజ్‌లో ఉందనే దానిపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియుల కోసం జక్కన్న తాజాగా ఒక ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
“మేము ఈ సినిమాకు సంబంధించిన మెజారిటీ షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేశాం. సినిమాలో వచ్చే అత్యంత కీలకమైన, భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అన్నింటి చిత్రీకరణ ఇప్పటికే పూర్తయింది. ప్రస్తుతం మేము కథను ముందుకు నడిపించే చిన్న చిన్న కనెక్టింగ్ సీన్స్ షూట్ చేస్తున్నాం. అంతా అనుకున్నట్లు జరిగితే ఈ ఏడాది సెప్టెంబర్ కల్లా లేదా అక్టోబర్ మొదటి వారంలోపు సినిమా మొత్తం షూటింగ్‌ను కంప్లీట్ (టాకీ పార్ట్ పూర్తి) చేస్తాం” అని రాజమౌళి స్పష్టం చేశారు.
ఇక రాజమౌళి ఇచ్చిన ఈ సాలిడ్ అప్‌డేట్‌తో షూటింగ్ ముగింపు దశకు వచ్చిందని తెలిసి మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు.దాదాపు 1300కోట్ల బడ్జెట్ తో తెరకేకుతున్న ఈసినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























