మాస్ మహారాజా రవితేజ, సక్సెస్ఫుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ డివోషనల్ యాక్షన్ డ్రామా ‘ఇరుముడి’ . మైత్రీ మూవీ మేకర్స్, టీ-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంపై ఇప్పటికే ఇండస్ట్రీలో అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ చిత్రంలోని మొదటి పాట ‘ఇరుముడి కట్టు’ను ఈరోజు ఉదయం 11:07 గంటలకు అధికారికంగా విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు రవితేజను ఊరమాస్ లుక్స్‌లో చూసిన అభిమానులకు ఈ పాట సరికొత్త అనుభూతిని ఇస్తోంది. శబరిమల అయ్యప్ప స్వామి భక్తుల ఇరుముడి నేపథ్యంలో సాగే ఈ సాంగ్‌కు మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ కుమార్ అద్భుతమైన స్వరాలు అందించారు. హై-ఎనర్జీ బీట్స్, ఆకట్టుకునే భక్తిరస సాహిత్యం, గూస్బంప్స్ తెప్పించే గాత్రంతో ఈ సాంగ్ ఇన్‌స్టంట్‌గా ఎక్కేసేలా ఉంది.
లిరికల్ వీడియోలో చూపించిన విజువల్స్, రవితేజ స్వామి మాల వేసుకుని ఉన్న లుక్ భక్తులను, సినీ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సాయి కుమార్, బేబీ నక్షత్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాను ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ మరోసారి స్పష్టం చేశారు.ఈ ఫస్ట్ సింగిల్‌తో సినిమాపై అంచనాలు డబుల్ అయ్యాయని చెప్పొచ్చు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























