ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా డైరెక్ట్ గా మారి తెరకెక్కిస్తున్న మోస్ట్ అవేటెడ్ మైథలాజికల్ ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా ‘నాగబంధం: ది సీక్రెట్ ట్రెజర్’.ఇందులో విరాట్ కర్ణ, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా జగపతి బాబు , అనసూయ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఈసినిమా ట్రైలర్ ఈరోజు హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పీసీఎక్స్ స్క్రీన్‌పై అత్యంత గ్రాండ్‌గా విడుదలయింది. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఒక సరికొత్త మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటికే విడుదలైన ‘నమో రే’, ‘సురా సురా’ పాటలు, టీజర్ ద్వారా క్రియేట్ అయిన పాజిటివ్ వైబ్‌ను ఈ ట్రైలర్ డబుల్ చేసిందనే చెప్పాలి. ఈ ట్రైలర్ విషయానికొస్తే, విజువల్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్లాయి. ప్రాచీన విష్ణు దేవాలయాల రహస్యాలు, నాగబంధం చుట్టూ తిరిగే గుప్తనిధుల వేట అనే లైన్‌ను చాలా గ్రిప్పింగ్‌గా చూపించారు. హీరో విరాట్ కర్ణ శివుడి ప్రేరణతో కూడిన పవర్ఫుల్ లుక్‌లో, ఇంటెన్స్ యాక్షన్ సీన్స్‌లో అద్భుతంగా మెప్పించగా, నభా నటేష్, ఐశ్వర్య మీనన్ క్యారెక్టర్లు కథలో చాలా కీలకమైనవిగా కనిపిస్తున్నాయి.
జునైద్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ హాలీవుడ్ రేంజ్ యాక్షన్ స్టంట్స్,మైండ్ బ్లోయింగ్ గ్రాఫిక్స్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లేలా ఉన్నాయి.మొత్తంగా చూసుకుంటే, మన దేశపు సంస్కృతి, పురాణాల ఆధారంగా వస్తున్న ‘నాగబంధం’ ట్రైలర్ అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది.జూలై 3న ఇండియా లెవెల్లో విడుదల కాబోతున్న ఈ చిత్రం, బాక్సాఫీస్ వద్ద విజువల్ వండర్‌గా నిలిచి సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.దాదాపు 120కోట్ల బడ్జెట్ తో కిషోర్ అన్నపురెడ్డి , నిషిత నాగిరెడ్డి ఈసినిమాను నిర్మిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























