సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. లెజండరీ డైరెక్టర్ భారతీరాజా కన్నుమూత

Legendary Director Bharathiraja Passes Away

దక్షిణాది చిత్రసీమలో తీవ్ర విషాదం నెలకొంది. తమిళ దిగ్గజ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. తమిళ సినిమాల్లో స్టూడియోలకే పరిమితమైన షూటింగ్‌లను బయటకు తీసుకొచ్చి, పచ్చని పల్లెటూళ్లు, మట్టి వాసనను వెండితెరకు పరిచయం చేసిన గొప్ప విప్లవాత్మక దర్శకుడిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన మృతికి గౌరవసూచకంగా అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో ‘పదహారేళ్ల వయసు’) చిత్రంతో భారతీరాజా దర్శకుడిగా ప్రస్థానం ప్రారంభించారు. కమల్ హాసన్, రజనీకాంత్, శ్రీదేవి వంటి స్టార్ల కెరీర్‌ను మలుపు తిప్పిన ఘనత ఆయనదే. తెలుగులోనూ ఆయన తన మార్క్ చూపించారు. టాలీవుడ్ హిస్టరీలోనే ల్యాండ్‌మార్క్ లవ్ స్టోరీగా నిలిచిన ‘సీతాకోకచిలుక’ చిత్రానికి ఆయనే దర్శకుడు. దీనితో పాటు మెగాస్టార్ చిరంజీవితో ‘ఆరాధన’, ‘జమదగ్ని’ వంటి చిత్రాలను తెరకెక్కించారు.

పల్లెటూరి కథలే కాకుండా ‘ఎర్ర గులాబీలు’, ‘టిక్ టిక్ టిక్’ వంటి మైండ్ బ్లోయింగ్ సస్పెన్స్, సైకో థ్రిల్లర్లతో సరికొత్త జానర్‌కు శ్రీకారం చుట్టారు. సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకుగానూ భారత ప్రభుత్వం 2004లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో పాటు ఆరు జాతీయ అవార్డులతో గౌరవించింది.

గత కొన్ని ఏళ్లుగా మెగాఫోన్ పక్కన పెట్టిన భారతీరాజా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారి విభిన్న పాత్రల్లో నటించారు. మణిరత్నం ‘యువ’ లో పొలిటికల్ విలన్‌గా మెప్పించిన ఆయన, ఇటీవల మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన తుడురమ్ లో చివరి సారిగా స్క్రీన్ పై కనిపించారు. అయితే గతేడాది (2025) ఆయన తనయుడు, నటుడు మనోజ్ భారతీరాజా అకాల మరణం చెందడం భారతీరాజాను తీవ్రంగా కుంగదీసింది. అప్పటినుండి ఆయన ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. భారతీరాజా మృతి పట్ల పవన్ కళ్యాణ్, రజనీకాంత్, కమల్ హాసన్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.