కోలీవుడ్ స్టార్ హీరో సూర్య , స్టార్ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘కరుప్పు’ .థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోయి, సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నిలిచిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీ ఇప్పుడు ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది.గత నెలలో విడుదలైన ఈసినిమా 300కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూర్యకు బిగ్గెస్ట్ హిట్ అందించింది. అంతేకాదు తెలుగులో ఈసినిమా వీరభద్రుడు గా వచ్చి 30కోట్ల వసూళ్లతో సూపర్ హిట్ అనిపించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది.జూన్ 12 నుండి ఈ చిత్రం ఓటీటీలో అందుబాటులోకి రానుంది.తమిళ ఒరిజినల్ వెర్షన్‌తో పాటు తెలుగు, కన్నడ , మలయాళ,హిందీ భాషల్లో ఒకేసారి స్ట్రీమింగ్ కానుంది.
కథ:
కూతురి లివర్ ఆపరేషన్ కోసం అమ్ముదామని తెచ్చిన నగలను ఒక తండ్రి దొంగల బారిన పడి పోగొట్టుకుంటాడు. పోలీసులను ఆశ్రయిస్తే, వారు కేవలం 45 సవర్ల బంగారం మాత్రమే రికవరీ చేసి, దాన్ని కూడా కోర్టు ఆర్డర్ ద్వారానే తీసుకోవాలని సూచిస్తారు. దీంతో ఆ తండ్రి పక్కా కమర్షియల్ లాయర్ అయిన బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) దగ్గరకు వెళ్తాడు. కానీ, బేబీ కృష్ణ డబ్బు కోసం జడ్జితో చేతులు కలిపి కేసును వాయిదాలు వేయిస్తూ, పోలీసులు రికవరీ చేసిన బంగారం కూడా వారికి దక్కకుండా చేయాలని చూస్తాడు.
దిక్కుతోచని స్థితిలో ఆ తండ్రి కోర్టు ఆవరణలో ఉన్న వీరభద్రుడి ఆలయానికి వెళ్లి, తన కష్టాన్ని తీర్చమని ఆ దేవుడిని వేడుకుంటాడు. ఆ తర్వాత అక్కడి క్షేత్రపాలకుడైన వీరభద్రుడు (సూర్య) స్వయంగా భూమ్మీదకు వస్తాడు. దైవిక శక్తులతో వచ్చిన వీరభద్రుడు ఆ తండ్రీకూతుళ్లకు ఎలా న్యాయం చేశాడు? ఆ అవినీతి లాయర్, వ్యవస్థకు ఎలాంటి బుద్ధి చెప్పాడు? అనే ఆసక్తికరమైన అంశాలతో ఈ ఫాంటసీ కోర్ట్‌రూమ్ డ్రామా సాగుతుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























