మెగా 158లోకి కన్నడ బ్యూటీ రచిత రామ్

Rachita Ram Bags a Key Role in Mega 158

మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రెండో సినిమాగా వస్తుంది మెగా 158. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. పొల్లాచ్చి, కేరళలోని అత్యంత అందమైన లొకేషన్లలో ఈ సినిమాకు సంబంధించిన కీలక షెడ్యూల్స్ చిత్రీకరణ జరుగుతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం.. ఈ సినిమాలో కీలక పాత్ర కోసం కన్నడ స్టార్ బ్యూటీ రచిత రామ్ ను మేకర్స్ ఫైనల్ చేశారు. రజనీకాంత్ – లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన ‘కూలీ’ లో ఈమె లేడీ విలన్‌గా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు మెగా 158లోకూడా రచిత నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించనుందని టాక్.

మొదట ఈ పవర్‌ఫుల్ లేడీ విలన్ పాత్ర కోసం మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ పేరు బలంగా వినిపించింది. కానీ కథలోని తీవ్రత దృష్ట్యా మేకర్స్ తమ ప్లాన్ మార్చి రచిత రామ్‌ను రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. మెగాస్టార్‌ను ఈమె స్క్రీన్ పై ఎలా ఢీకొడుతుందనేది చూడాలి.

ఈ చిత్రంలో చిరంజీవి కూతురి పాత్ర కూడా కథకు చాలా కీలకమని సమాచారం. మలయాళ కుట్టి అనస్వర రాజన్ ఇందులో చిరు కూతురిగా కనిపించబోతోంది. దీంతో పాటు మరికొంతమంది టాలెంటెడ్ నటీనటులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

కెవిఎన్ ప్రొడక్షన్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో, ఎక్కడా రాజీ పడకుండా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను నిర్మిస్తోంది.తెలుగులో ఈ సంస్థకు ఇదే మొదటి సినిమా. స్టార్ కంపోజర్ థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా ఈసినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.