డిఫరెంట్ ఎంటర్టైనర్స్ చేస్తున్న తరుణ్ భాస్కర్, రైటర్- డైరెక్టర్ కశ్యప్ శ్రీనివాస్‌తో కలిసి ‘గాయపడ్డ సింహం’ తో అలరించబోతున్నారు. ఈ చిత్రంలో హీరో శ్రీవిష్ణు స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని పవన్ సాదినేని సమర్పణలో, కళ్యాణ చక్రవర్తి మంథిన, భాను కిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ సప్తస్వ మీడియా వర్క్స్, పిఓవి స్టోరీస్, జీ స్టూడియోస్ బ్యానర్ల పై నిర్మించారు. ఫరియా అబ్దుల్లా, మానస చౌదరి కథానాయికలుగా నటించారు. జేడి చక్రవర్తి కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ క్రియేట్ చేసింది. గాయపడ్డ సింహం మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ విసా స్టాపింగ్ ఈవెంట్ నిర్వహించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో నారా రోహిత్ మాట్లాడుతూ. “అందరికీ నమస్కారం. ‘గాయపడ్డ సింహం’ టీమ్‌కి కంగ్రాచులేషన్స్. అందరికీ చాలా పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఇక్కడికి రావడానికి కారణం విజయ్, పవన్ — వాళ్లిద్దరి కోసం వచ్చాను. విజయ్‌తో నాకు చాలా కాలంగా అసోసియేషన్ ఉంది. అలాగే పవన్‌తో కూడా నేను నెక్స్ట్ సినిమా ఇదే బ్యానర్లో చేస్తున్నాను. కళ్యాణ్ గారు, భాను గారు, విజయ్ గారికి ఈ సినిమా ఒక మెమొరబుల్ ఫిల్మ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మే 1న అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని ఎంకరేజ్ చేయకండి. థాంక్యూ సో మచ్.”
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























