ధురంధర్ 1 జపాన్ లో కూడా

Dhurandhar 1 Set for Japan Release

రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్ 1’ ఇప్పుడు జపాన్ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఈ చిత్రం జూలై 10, 2026న జపాన్ అంతటా గ్రాండ్‌గా విడుదల కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గత ఏడాది చివర్లో థియేటర్లలోకి వచ్చిన సినిమా ప్రపంచవ్యాప్తంగా దాదాపు ₹1,328 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హిందీ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

జపాన్ వెర్షన్ కోసం ప్రత్యేకమైన పోస్టర్లు మరియు లోకలైజ్డ్ ప్రమోషనల్ మెటీరియల్‌ను చిత్ర యూనిట్ సిద్ధం చేసింది. ‘RRR’ వంటి చిత్రాలకు జపాన్‌లో వచ్చిన ఆదరణను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమాను కూడా భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రణ్‌వీర్ సింగ్‌తో పాటు సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ డ్రామా జపాన్ బాక్సాఫీస్ వద్ద కూడా సరికొత్త రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇక ఈసినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ధురంధర్ : ది రివెంజ్ రీసెంట్ గా విడుదలై వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులను నెలకొల్పింది.ఇప్పటికీ ఈసినిమా డీసెంట్ వసూళ్లతో అదరగొడుతుంది. ఫుల్ రన్ లో 1800కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.