నందమూరి బాలకృష్ణ తన తదుపరి చిత్రాలను వరుసగా లైన్లో పెడుతూ స్పీడ్ పెంచారు. ‘డాకు మహారాజ్’ తరువాత తన 111వ సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేసేందుకు బాలయ్య సిద్ధమయ్యారు. వృద్ధి సినిమాస్ నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే, ఈ సినిమా ఇంకా ప్రారంభం కాకముందే బాలయ్య తన 112వ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ చిత్ర దర్శకుడు ఎవరనే దానిపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ.
నిజానికి కొరటాల శివ ‘దేవర’ సీక్వెల్ (దేవర 2) పనుల్లో ఉండాల్సి ఉంది. అయితే, జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండటం వల్ల, ‘దేవర 2’ ప్రారంభానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోపు దొరికిన గ్యాప్‌లో బాలయ్యతో ఒక భారీ సినిమా చేయాలని కొరటాల ప్లాన్ చేశారట. ఆయన చెప్పిన కథకు బాలకృష్ణ కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని ‘దేవర’ నిర్మాత, యువసుధ ఆర్ట్స్ అధినేత సుధాకర్ మిక్కిలినేని నిర్మించనున్నారని తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బాలయ్య మార్కు మాస్ ఇమేజ్‌కు కొరటాల శివ సామాజిక సందేశం తోడైతే బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడం ఖాయమని అభిమానులు ఆశిస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























