టాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత మరియు రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు.
చిట్టిబాబు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాత్రి గుండెపోటు రావడంతో ఆయన తుదిశ్వాస విడిచారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1955 జూలై 28 న కృష్ణా జిల్లా , గుడ్లవల్లేరు గ్రామంలో ప్రముఖ నిర్మాత త్రిపురనేని మహారథి, హేమలత దంపతులకు జన్మించారు. ఆయన అసలు పేరు వరప్రసాద్.చిట్టిబాబు గారు కేవలం నిర్మాతగానే కాకుండా దర్శకుడిగా, నటుడిగా, కమెడియన్‌గా మరియు కో-డైరెక్టర్‌గా సినీ ఇండస్ట్రీలో తన ముద్ర వేశారు.
‘సంతానం’ సినిమాతో దర్శకుడిగా మారి, మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. దాదాపు 49 సినిమాలకు కో-డైరెక్టర్‌గా పనిచేశారు.
30కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా నటించి మెప్పించారు. దివంగత ప్రముఖ నటి సౌందర్యను తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది చిట్టిబాబు గారే.
ఆయన మరణం పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక విలక్షణమైన సినీ విశ్లేషకుడిని, అనుభవజ్ఞుడైన నిర్మాతను పరిశ్రమ కోల్పోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























