థాయిలాండ్ షెడ్యూల్ షూట్ లో ఈ నగరానికి ఏమైంది రిపీట్

Thailand Schedule Underway for ENE Repeat

‘ఈ నగరానికి ఏమైంది’ భారీ విజయం సాధించింది, ముఖ్యంగా యువతలో ప్రత్యేకమైన స్థానం సంపాదించింది. స్నేహం, సరదా కథనంతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. కల్ట్ స్టేటస్ పొందిన ఈ సినిమా రీ-రిలీజ్ సమయంలో కూడా అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన అందుకుంది. ఈ సక్సెస్ ని కొనసాగిస్తూ మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటోంది. విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను మళ్లీ కలిసి నటిస్తూ, మొదటి భాగంలో కనిపించిన కెమిస్ట్రీని తిరిగి తెరపైకి తీసుకురానున్నారు. శ్రీనాథ్ మాగంటి కొత్తగా జాయిన్ అవుతున్నారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహిస్తూ తన యూనిక్ క్విర్కీ స్టైల్‌ను కొనసాగిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్‌పై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్‌లో జరుగుతోంది, ఈ షెడ్యూల్‌ నెల పాటు కొనసాగుతుంది. సెట్ నుంచి వచ్చిన ఫోటో అందరినీ ఆకట్టుకుంది. “టీమ్ కన్యారాసి” గ్యాంగ్‌కు చెందిన ఆ నలుగురు అబ్బాయిలు, వింటేజ్ కన్వర్టిబుల్ కారులో హాయిగా కూర్చుని, ఎంతో ఉత్సాహంతో కనిపిస్తున్నారు. ఈ ఫ్రేమ్ రెట్రో వైబ్‌, మోడరన్ బ్రో ట్రిప్ స్ఫూర్తితో అందంగా కనిపిస్తోంది.

మొదటి భాగంలో ఉన్న కేర్‌ఫ్రీ స్పిరిట్, ఫన్‌ను మళ్లీ తెరపైకి తీసుకురానున్నారు. ఒరిజినల్ టీమ్ తిరిగి కలవడంతో నాస్టాల్జియా కూడా యాడ్ అవుతోంది.

ఈ సీక్వెల్‌కు స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ కూడా తోడైంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. రవితేజ గిరిజాల ఎడిటింగ్, సౌమిత్రి ఎన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.‘ఈఎన్ఈ రిపీట్’ గురించి మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.