నాని చేతుల మీదుగా వాలా Ⅱ రిలీజ్

Vaazha 2 Telugu Trailer released

కేరళ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని నమోదు చేసిన మలయాళ సంచలనం ‘వాలా Ⅱ’ ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. సావిన్ SA దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హషీర్ H, అలన్ బిన్ సిరాజ్, అజిన్ జాయ్,  వినాయక్ V వంటి యువ నటీనటులు ఆకట్టుకున్నారు. వీరి నటనకు ప్రేక్షకుల నుండి విశేష ప్రశంసలు లభించాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాహు గారపాటి తన ‘షైన్ స్క్రీన్స్’ బ్యానర్‌పై, విపిన్ దాస్, హారిస్ దేశం, P.B. అనిష్, ఆదర్శ్ నారాయణ్, ఐకాన్ స్టూడియోస్‌తో కలిసి నిర్మించిన ఈ చిత్రం మలయాళంలో ఇప్పటికే 200 కోట్ల స్థూల వసూళ్లతో భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగు వెర్షన్ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ‘నేచురల్ స్టార్’ నాని ఈ చిత్రం  థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేశారు.

‘వాలా’ ముగిసిన దగ్గర నుంచి కొనసాగుతూ..  సీక్వెల్ కథ మెయిన్  గ్యాంగ్ జీవితాలను ప్రజెంట్ చేసింది. కాలేజ్ జీవితం, మారుతున్న స్నేహాలు, అనూహ్య మలుపులు… కొత్త దశలో వారి ప్రయాణం సాగుతుంది. ట్రైలర్ చూస్తే కామెడీ, భావోద్వేగ క్షణాలు కలగలిపిన కథతో పాటు, నాస్టాల్జియా మూమెంట్స్ తో కట్టిపడేసింది.

ఈ చిత్రంలోని ప్రత్యేకతల్లో ఒకటి ‘ప్రేమమ్’ సినిమాకు ఇచ్చిన ట్రిబ్యూట్. అల్‌ఫోన్స్ పుత్రెన్ దర్శకత్వంలో నివిన్ పాలీ నటించిన ఆ సినిమా ఇంపాక్ట్ ఇందులో కనిపిస్తుంది. హషీర్, అజిన్ జాయ్, వినాయక్, అలన్ బిన్ సిరాజ్ తమ పాత్రలతో ఆకట్టుకున్నారు, బిజు కుట్టన్, సుధీష్, విజయ్ బాబు వంటి అనుభవజ్ఞులు నటిస్తున్నారు.

సాంకేతికంగా, నిర్మాణ విలువల పరంగా కూడా ఈ సినిమా బలంగా నిలుస్తోంది. ట్రైలర్ ఆధారంగా చూస్తే యూత్ ఫుల్ ఎలిమెంట్స్, ఎమోషనల్ మూమెంట్స్ తో ‘వాలా 2’ తెలుగు ప్రేక్షకుల గుర్తుండిపోయే సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడానికి సిద్ధమౌతోంది.‘వాలా 2’ ఈ నెల 24న థియేటర్లలో విడుదల కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.