డెకాయిట్‌ చాలా ఎంజాయ్ చేశాను: డైరెక్టర్ నాగ్ అశ్విన్

Dacoit Was Thoroughly Enjoyable Says Nag Ashwin

హిట్ మిషన్ అడివి శేష్ లేటెస్ట్ ఆడియన్స్ బ్లాక్ బస్టర్ ‘డెకాయిట్‌. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. షానియల్ డియో దర్శకత్వం వహించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్ తో విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకొని సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు అల్లు అరవింద్, బన్నీవాసు, స్వప్నదత్, నందిని రెడ్డి పాల్గొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డైరెక్టర్ నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. అందరికీ హాయ్. సినిమా తీయడం రాయడం అంత ఈజీ కాదు. అలాగే రిలీజ్ కూడా. ఒక సినిమాకి రెండు మూడేళ్లు పడుతుంది. ఆ సమయంలో అసలు ఎందుకు చేస్తున్నామనే ఆలోచనలు కూడా వస్తాయి. మనందరి ప్రయత్నం కూడా ఒక మంచి సినిమా తీయాలని. ఈ జర్నీలో వాళ్ళందరి ఎక్స్పీరియన్స్ లు వింటుంటే చాలా ఫ్యాషన్ తో ఈ సినిమా తీశారు అనిపిస్తుంది. ప్రేమతోనే సినిమా చేస్తాం. ఆ ప్రేమతోనే సినిమాకి ప్రాణం వస్తుంది. డెకాయిట్ చూసి ఆడియన్స్ చాలా ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు. సుప్రియ గారు నా సీనియర్. వారు ఇంత మంచి సినిమాని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. శేష్ సినిమా వస్తుంటే చాలా నేర్చుకోవచ్చు. రైటింగ్ ఎడిటింగ్ స్క్రీన్ ప్లే అని చాలా కొత్తగా ఉంటాయి. సినిమాని హిట్ అయ్యేవరకు తీస్తారు. అది ఆయన పాషన్. టీమ్ అందరికీ బిగ్ కంగ్రాజులేషన్స్. డెకాయిట్ సమ్మర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. ఈ సినిమా చూసినప్పుడు మనసు బరువు ఎక్కుతుంది. ఇలాంటి ఫీలింగ్ చాలా అరుదుగా వస్తుంది. సినిమాని చూసినప్పుడు ఒక ఎక్సైట్ మెంట్ కలగాలి. అలాంటి ఎక్సైట్మెంట్ కలిగించిన సినిమా ఇది. మృణాల్ అమెజింగ్. తను స్మిత పాటిల్, మధుబాల లాంటి గొప్ప క్యారెక్టర్స్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈ సినిమా నేను చాలా ఎంజాయ్ చేశాను. మా టీం అందరూ సినిమాకి వెళ్తారు. అందరికీ థాంక్యూ సో మచ్.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.