కిరణ్ అబ్బవరం నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి TV’ చిత్రానికి సంబంధించి ఒక భారీ డీల్ కుదిరింది. ఈ సినిమా నైజాం ఏరియా పంపిణీ హక్కులను ప్రముఖ అగ్ర నిర్మాణ మరియు పంపిణీ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) దక్కించుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ రాజు నేతృత్వంలోని SVC సంస్థ ఈ సినిమాను నైజాం అంతటా గ్రాండ్‌గా విడుదల చేయబోతోంది. ఒక చిన్న సినిమాకు దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత అండగా నిలవడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని పెంచుతోంది. 90వ దశకం నాటి పల్లెటూరి వాతావరణం, టీవీ చుట్టూ తిరిగే వినోదాత్మక కథాంశం ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని భావిస్తున్నారు.
సాయి తేజ్, వేద జలంధర్ జంటగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 17, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. ఇప్పుడు SVC చేతుల్లోకి వెళ్లడంతో ఈ సినిమాకు థియేటర్ల కౌంట్ కూడా భారీగా పెరగనుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























