ఇటీవలే శంబాలతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ హీరో ఆది సాయి కుమార్ నెక్స్ట్ మూవీ ‘సైరా బాను’ ఘనంగా ప్రారంభమైంది.ఈ చిత్రాన్ని ఫణి కృష్ణ సిరికి దర్శకత్వం వహిస్తున్నారు. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘సైరా బాను’ ఒక పూర్తిస్థాయి రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, ముఖ్యంగా ‘హిందూ-ముస్లిం’ ప్రేమకథా నేపథ్యంతో సాగే వినోదాత్మక చిత్రంగా ఉండబోతోందని సమాచారం. తాజాగా విడుదలైన టైటిల్ పోస్టర్ చాలా కలర్‌ఫుల్‌గా ఉండి, “A Fun Filled Journey of Love, Faith & Destiny” అనే ట్యాగ్‌లైన్‌తో ఆకట్టుకుంటోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. గతంలో ఆది మరియు ఫణి కృష్ణ కాంబినేషన్‌లో ‘క్రేజీ ఫెలో’ వంటి హిలేరియస్ ఎంటర్‌టైనర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ వీరిద్దరూ కలిసి ఒక క్రేజీ లవ్ స్టోరీతో రాబోతుండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఆది సాయి కుమార్ తన కెరీర్‌లో ఈ సినిమాతో మరో సాలిడ్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్రంలో ఆది సాయి కుమార్ సరసన యువ నటి బాంధవి శ్రీధర్ కథానాయికగా నటించనుండగా వెన్నెల కిశోర్, సత్య, గెటప్ శ్రీను వంటి ప్రముఖ హాస్యనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. సీనియర్ నటులు సాయి కుమార్ మరియు మురళీ శర్మ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.
శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తుండగా, రామ్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఎడిటింగ్ బాధ్యతలను చోటా కె. ప్రసాద్ చూసుకుంటున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























