అడివి శేష్ డెకాయిట్‌ సెన్సార్ పూర్తి

Censor Formalities Completed for Adivi Sesh’s Dacoit

యంగ్ హీరో అడివి శేష్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ ‘డెకాయిట్‌’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, అలాగే ‘రుబారు’ చిచ్చుబుడ్డి పాటలు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి.

ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఈ చిత్రం తాజాగా రెండు భాషల్లో సెన్సార్ పూర్తి చేసుకుంది.
సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి యూ/ ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. సినిమా అద్భుతంగా వుందని సెన్సార్ సభ్యులు మూవీ టీంని అభినందించారు.

అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి భీమ్స్ బ్లాక్ బస్టర్ అల్బమ్ అందించారు. ధనుష్ భాస్కర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. జ్ఞాని నేపథ్య సంగీతం సమకూర్చారు.రేపు ఈసినిమా ట్రైలర్ రిలీజ్ కానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.