మరోసారి థియేటర్లలోకి రానున్న అతడు

Athadu Set for Theatrical Re-Release

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ఒక ‘కల్ట్ క్లాసిక్’గా నిలిచిన ‘అతడు’ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. గతంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా (2025లో) విడుదలైన ఈ చిత్రం, ఇప్పుడు సరికొత్త టెక్నాలజీతో మళ్ళీ రాబోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఐకానిక్ చిత్రం ఫిబ్రవరి 28, 2026న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది.ఈ సినిమాను అత్యాధునిక 4K ఫార్మాట్‌లోకి మార్పు చేశారు, దీనివల్ల విజువల్స్ చాలా క్లియర్‌గా మరియు రిచ్‌గా కనిపిస్తాయి.సౌండ్ ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరుస్తూ డాల్బీ ఆడియో టెక్నాలజీని జోడించారు.

సీనియర్ నటుడు మరియు నిర్మాత మురళీ మోహన్ ఈ చిత్రాన్ని తమ జయభేరి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించారు.: బుల్లితెరపై ఆల్‌టైమ్ రికార్డులు సృష్టించిన ఈ సినిమాను వెండితెరపై మరోసారి చూడాలని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నైజాం లో ఈసినిమాను ఏషియన్ సినిమాస్ రిలీజ్ చేస్తుంది.మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో త్రిష కథానాయికగా నటించగా మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.