ప్రముఖ నిర్మాత దిల్ రాజు తాజాగా ‘గాయపడ్డ సింహం’ చిత్రానికి సంబంధించి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాపై ఉన్న అంచనాలు మరియు తాజాగా విడుదలైన టీజర్‌కు వచ్చిన రెస్పాన్స్‌తో ఆయన ఈ చిత్ర హక్కులను సొంతం చేసుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమా టీజర్ మరియు కంటెంట్ ప్రముఖ నిర్మాత , డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజుకు బాగా నచ్చడంతో, ఆయన ఈసినిమా ఏపీ &తెలంగాణ ,ఓవర్సీస్ థియేట్రికల్ హక్కులను భారీ ధరకు దక్కించుకున్నారు.దిల్ రాజు వంటి స్టార్ నిర్మాత చేతిలోకి ఈ ప్రాజెక్ట్ వెళ్లడంతో, సినిమాకు ఒక్కసారిగా భారీ హైప్ వచ్చింది. ఈ సినిమాను తన పంపిణీ సంస్థ (శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్) ద్వారా సమ్మర్ కానుకగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల నైజాం పంపిణీ విషయంలో వచ్చిన కొన్ని ఇబ్బందుల తర్వాత, ‘గాయపడ్డ సింహం’ మరియు యష్ ‘టాక్సిక్’ వంటి క్రేజీ ప్రాజెక్టులను దక్కించుకోవడం ద్వారా దిల్ రాజు మళ్ళీ తన పట్టును నిరూపించుకుంటున్నారు.
గాయపడ్డ సింహంలో దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తుండగా, ఆయన సరసన ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. “డోంట్ లాఫ్… ఇట్స్ ఏ సీరియస్ మేటర్” అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమా ఒక పొలిటికల్ అండ్ సోషల్ సెటైర్‌గా ఉండబోతోంది. అమెరికాలో స్థిరపడాలనుకునే ఒక యువకుడు, అక్కడి రాజకీయ పరిణామాల వల్ల ఎదుర్కొన్న ఇబ్బందులను కామెడీ-యాక్షన్ మిక్స్‌తో ఇందులో చూపించబోతున్నారు. కశ్యప్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, స్వీకర్ అగస్తీ సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పవన్ సాదినేని ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























