మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘కల్ట్’. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రానుంది. ఈ టీజర్ ఫిబ్రవరి 21, 2026న విడుదల కానుంది. ఈ సినిమాను భారతదేశపు మొట్టమొదటి ‘స్లాషర్ హర్రర్’ చిత్రంగా తెరకెక్కుతుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సినిమాలో ఒక భయంకరమైన టెడ్డీ బేర్ పాత్రను ‘జీ బూమ్ బా’ పేరుతో పరిచయం చేశారు. “ఇది బొమ్మ కాదు.. జోక్ కాదు.. పిల్లల కోసం అంతకన్నా కాదు” అంటూ రీసెంట్ గా పోస్టర్ విడుదలచేశారు.
ఈ చిత్రంలో గాయత్రీ భరద్వాజ్, యజ్ఞ తుర్లపాటి కథానాయికలుగా నటిస్తుండగా, తారక్ పొన్నప్ప విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ డైలాగ్స్ అందిస్తున్నారు.
తొలుత ఇదొక పార్టీ థ్రిల్లర్‌గా ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత పూర్తిస్థాయి స్లాషర్ హర్రర్ చిత్రంగా మార్పులు చేసినట్లు సమాచారం. వాస్తవ ఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, జపనీస్, స్పానిష్ మరియు ఇంగ్లీష్ భాషల్లో ‘పాన్-వరల్డ్’ స్థాయిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.టీజర్ రిలీజ్ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో విశ్వక్ సేన్ కోటు ధరించి, నోట్లో సిగరెట్, చేతిలో గొడ్డలి పట్టుకుని రక్తపు మడుగులో నడుస్తున్న తీరు సినిమా ఎంత వయలెంట్‌గా ఉండబోతుందో సూచిస్తోంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























