కొత్త లుక్ లోకి ఎన్టీఆర్

NTR Stuns Fans With a New Look

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం #NTRNeel.నిజానికి ఈసినిమా ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకోవాల్సివుంది కానీ ఎన్టీఆర్ లుక్ మార్చుకోడానికి చాలా సమయం తీసుకోవడంతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇక ఎన్టీఆర్ కొత్త లుక్ లోకి మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రశాంత్ నీల్ కథా అవసరాల దృష్ట్యా ఎన్టీఆర్ బాగా స్లిమ్ అయ్యారు. మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్‌ఫుల్ అండ్ షార్ప్ ఫిజిక్‌తో ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. నిన్న ఎయిర్‌పోర్ట్‌లో ఒత్తైన గడ్డంతో, కొత్త హెయిర్ స్టైల్‌లో కనిపించిన ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి.ఈ సినిమా కీలకమైన షెడ్యూల్ జోర్దాన్ దేశంలో ప్రారంభమైంది. ఫిబ్రవరి 8 నుంచే ఈ ఇంటర్నేషనల్ షెడ్యూల్ మొదలైనట్లు సమాచారం.

ఈ జోర్దాన్ షెడ్యూల్‌లో మూడు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లను చిత్రీకరించనున్నారు. ఈ ఎపిసోడ్స్ సినిమా కథలో చాలా కీలకమైన మలుపులుగా ఉంటాయని తెలుస్తోంది.ఎన్టీఆర్ కెరీర్‌లోనే ఇవి అత్యుత్తమ యాక్షన్ సీన్స్ కావాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నారు.మే లో ఈసినిమాకు సంబందించిన భారీ అప్డేట్ రానుంది.

మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.దీనికి రవి బస్రూర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.ఎన్టీఆర్ అభిమానులు ఆయన కొత్త మేకోవర్ చూసి ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ మార్కు ఎలివేషన్స్‌తో ఎన్టీఆర్ ఈ సినిమాలో విశ్వరూపం చూపించబోతున్నారని స్పష్టమవుతోంది.ఈఏడాది చివర్లో ఈసినిమాను రిలీజ్ చేయాలని చూస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.