పెద్ది టైటిల్ సాంగ్ రానుంది

Title Song of Peddi Set for Release

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ మ్యూజికల్ అప్‌డేట్ గురించి ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ సాంగ్ ను ఈ నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్ 200 మిలియన్లకు పైగా వ్యూస్ తో సెన్సేషన్ సృష్టించి సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ఇక ఇప్పుడు సెకండ్ సింగిల్ రానుంది. . ఈ టైటిల్ సాంగ్ చాలా ఎనర్జిటిక్‌గా, రామ్ చరణ్ ఇమేజ్‌కి తగ్గట్లుగా ఉండబోతోందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా. ఇందులో రామ్ చరణ్ తన బాడీ లాంగ్వేజ్‌ను, మేకోవర్‌ను పూర్తిగా మార్చుకున్నారు.

ఇందులో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ ఒక కీలక పాత్రలో మెరవనున్నారు. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.రీసెంట్ రిలీజ్ డేట్ కూడా మార్చేశారు. నిజానికి మార్చి 27న విడుదలకావాల్సి ఉండగా షూటింగ్ పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ 30కి వాయిదా వేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.