స్పిరిట్ నుండి తప్పుకోవడంపై స్పందించిన ప్రకాష్ రాజ్

Prakash Raj Breaks Silence on Stepping Away From Spirit

విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్,రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ నుండి తప్పుకున్నారంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన తాజాగా స్పందించారు. ఈ ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రకాష్ రాజ్ తన ‘X’ ఖాతా ద్వారా స్పందిస్తూ.. “ఫేక్ న్యూస్ వ్యాప్తి చేసేవారికి ఒక విన్నపం. ‘స్పిరిట్’ సినిమాలో నా సీన్లకు సంబంధించిన షూటింగ్ ఇంకా ప్రారంభమే కాలేదు. షూటింగే మొదలవ్వకుండా నేను తప్పుకున్నానని మీ వాట్సాప్ ఫ్యాక్టరీల్లో కథలు ఎలా అల్లుతున్నారు? దయచేసి బాధ్యతాయుతంగా ఉండండి” అని ఘాటుగా సమాధానమిచ్చారు.

గత రెండు రోజులుగా ప్రకాష్ రాజ్ మరియు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని, అందుకే ఆయన ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ఆయన జైలర్ పాత్ర పోషిస్తున్నారని, టీజర్‌లో ఆయన వాయిస్ కూడా వినిపించడంతో ఈ వార్తలు మరింత హాట్ టాపిక్‌గా మారాయి.అయితే తాజాగా ప్రకాష్ రాజ్ ఇచ్చిన క్లారిటీతో ఈ రూమర్లకు తెరపడినట్లయింది. ఆయన ఇంకా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగమేనని స్పష్టమైంది.

ఈ సినిమాలో ప్రభాస్ పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్‌గా నటిస్తుండగా, తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో మెరవనున్నారు. 2027 మార్చి 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.