దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతూ చేస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ కావడంతో, ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రీసెంట్ గా మలేషియా లో గ్రాండ్ గా ఆడియో లాంచ్ ఈవెంట్ జరిగింది.చెన్నై లో కూడా ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అనిపించుకున్నాయి. నిన్న తెలుగులో విడుదలైన సాంగ్ అయితే సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ప్రమోషన్లలో భాగంగా పవర్‌ఫుల్ ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. జనవరి 2న ఈ ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.అదే రోజు తమిళ వెర్షన్ తోపాటు తెలుగు , హిందీ ట్రైలర్లు కూడా రానున్నాయి. ఈ ట్రైలర్ ద్వారా విజయ్ పోషిస్తున్న పొలిటికల్ లీడర్ పాత్రలోని లోతును మరియు సినిమా ప్రధాన ఇతివృత్తాన్ని పరిచయం చేయబోతున్నారు.
దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని ఒక పక్కా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మలుస్తున్నారు. విజయ్ తన రాజకీయ ప్రయాణానికి నాంది పలుకుతున్న సమయంలో వస్తున్న ఈ సినిమా కావడంతో, ఇందులో ఉండే డైలాగులు మరియు సన్నివేశాలు చాలా సీరియస్‌గా, సందేశాత్మకంగా ఉండబోతున్నాయని సమాచారం. ఇప్పటికే ఓవర్సీస్ లో సెన్సేషనల్ అడ్వాన్స్ బుకింగ్స్ అవుతున్నాయి. జన నాయగన్ క్రేజ్ చూస్తుంటే 100 కోట్ల ఓపెనింగ్ పక్కా.
ఈసినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటించగా మామితా బైజు కీలక పాత్రలో కనిపించనుంది. బాబీ డియోల్ ప్రతినాయకుడి పాత్ర పోషించారు.అనిరుధ్ సంగీతం అందింస్తుండగా భారీ బడ్జెట్‌తో కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం జనవరి 9న గ్రాండ్‌గా విడుదల కానుంది. తెలుగులో ఈసినిమా జన నాయకుడు గా రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























