మాస్ మహారాజా రవితేజ నెక్స్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి తో వస్తున్నాడు.పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తి చేసుకొని విడుదలకు రెడీ అవుతుంది. అందులో భాగంగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయనున్నారు. ఇక ఈసినిమాకు షాకింగ్ రన్ టైం ఫిక్స్ చేశారని సమాచారం. ఫస్ట్ హాఫ్ కి 70 నిమిషాలు అలాగే సెకండ్ హాఫ్ 60 నిమిషాలతో మొత్తం 2 గంటల 10 నిమిషాల నిడివి సెట్ చేశారట. ఓ స్టార్ హీరో సినిమా ఇంత తక్కువ రన్ టైంతో రానుండడం చాలా అరుదు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పటికే రిలీజైనా రెండు పాటలు , టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేశాయి.జనవరి 2న మూడో పాటను రిలీజ్ చేయనున్నారు. అందులో భాగంగా ఈరోజు ఈ సాంగ్ ప్రోమో ను వదలనున్నారు.రవితేజ రొటీన్ కు భిన్నంగా ఈసారి రిఫ్రెషింగ్ కంటెంట్ తో వస్తున్నాడు. కిశోర్ తిరుమల డైరెక్షన్ లో ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించగా , ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు.భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.
సంక్రాంతి కానుకగా జనవరి 13న థియేటర్లలోకి రానుంది. ఇక పండుగ బరిలో మరికొన్ని సినిమాలు కూడా వస్తుండటంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.అయితే ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ గా వస్తున్న ఈసినిమా పర్ఫెక్ట్ పండుగ సినిమా అనిపించుకుంటుందని టీం కాన్ఫిడెంట్ గా వుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























