ఆది సాయి కుమార్ హీరోగా నటించిన శంబాల చిత్రం ప్రస్తుతం సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ మూవీని మహీధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకి యుగంధర్ ముని దర్శకత్వం వహించారు. డిసెంబర్ 25న విడుదలై ఈ చిత్రం ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ క్రమంలో సోమవారం నాడు చిత్రానికి సంబంధించిన విజయోత్సవ వేడుక డివైన్ బ్లాక్ బస్టర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, ప్రముఖ దర్శకులు వశిష్ట, బాబీ, యంగ్ హీరో సందీప్ కిషన్, ప్రముఖ రచయిత కోన వెంకట్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్‌లో..
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆది సాయి కుమార్ మాట్లాడుతూ .. శంబాల సక్సెస్ మీట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అడిగిన వెంటనే వచ్చిన అల్లు అరవింద్ గారికి థాంక్స్. సినిమా చూసి మరీ ఆయన ఇక్కడకు వచ్చారు. ఈ జర్నీలో ఇండస్ట్రీలో నుంచి ఎంతో మంది నాకెంతో సపోర్ట్ చేశారు. మా ట్రైలర్ రిలీజ్ చేయడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ అని కూడా ప్రభాస్ గారు పోస్ట్ పెట్టారు. నాకు హిట్టు పడాలని అందరూ సపోర్ట్ చేశారు. మా డైరెక్టర్ యుగంధర్ గారు ఈ మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు. ప్రతీ క్రెడిట్ ఆయనకే దక్కాలి. యుగంధర్ పడిన కష్టమే ఇదంతా. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మాకు సపోర్ట్ చేసిన నిర్మాతలిద్దరికీ థాంక్స్. మళ్లీ మేమంతా కలిసి ఓ సినిమా చేయాలని కోరుకుంటున్నాను. ఈ ప్రయాణంలో సపోర్ట్ చేసిన అర్చన గారికి థాంక్స్.
శంబాలలో పని చేసిన, సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్క నటుడికి థాంక్స్. శ్రీ చరణ్ పాకాల ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపి అద్భుతమైన ఆర్ఆర్ ఇచ్చారు. శంబాల కోసం టెక్నికల్ టీం చాలా కష్టపడింది. శంబాలని థియేటర్లోనే చూడండి. కచ్చితంగా డిజప్పాయింట్ అవ్వరు. మంచి సినిమాని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఆడియెన్స్‌ని కోరుతున్నాను. మా మూవీని ఇంతలా ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు, మీడియాకి థాంక్స్. ఇకపై కొత్త ఆదిని చూస్తారు. అన్ని జాగ్రత్తలు తీసుకుని మంచి సినిమాలు చేస్తాను అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























