అఖండ 2కి లాజిక్కులు అక్కర్లేదు – దిల్ రాజు

Akhanda 2 Doesn’t Need Logic says Dil Raju

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను అఖండ భారత్ బ్లాక్ బస్టర్ ‘అఖండ 2: ది తాండవం. ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పించారు. డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ అఖండ భారత్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.  

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 ఈ ఈవెంట్ లో నిర్మాత  దిల్ రాజు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. 11న రాత్రి ప్రీమియర్స్ మొదలైనప్పుడు నుంచి మాకు ఒక క్యూరియాసిటీ. నేను సుదర్శన్ కి వెళ్లాను. శిరీష్ గారిని కూకట్ పల్లి థియేటర్ పంపించాను. మిగతా వారిని వేరే థియేటర్స్ కి పంపించాను. అన్ని చోట్ల రియాక్షన్స్ అదిరిపోయింది. బోయపాటి గారు బాలకృష్ణ గారిని ఇండియన్ సూపర్ హీరో చేశారు. దైవంతో కూడిన ఒక క్యారెక్టర్ ని డిజైన్ చేసి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక సూపర్ హీరోని చేయడం బోయపాటి గారికి బాలకృష్ణ గారికి చెందింది. ఒక గొప్ప మ్యాజిక్ జరిగింది. ఆడియన్స్ ప్రతి ఎపిసోడ్ కి అద్భుతమైన రెస్పాన్స్ ఇస్తున్నారు. 

ప్రతి ఒక్క ఎపిసోడ్లో బాలకృష్ణ గారిని బోయపాటి గారి అద్భుతంగా చూపించారు. ఫ్రైడే సెకండ్ షోస్  నుంచి ఎక్కడ చూసినా థియేటర్స్ ఉదృతంగా మారాయి. మహిళలు పిల్లలు ఈ సినిమాని అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు. తెలంగాణలో రిలీజ్ చేసిన మాకు మూడో రోజే 70 పెర్సెంట్ రికవర్ చేశాం. ఈమధ్య బాలకృష్ణ గారి దాదాపు సినిమాలన్నీ మేమే రిలీజ్ చేస్తున్నాం. సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ రావడం ఒక నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్ గా చాలా ఆనందంగా ఉంది. బాలకృష్ణ గారికి బోయపాటి గారికి టీమ్ అందరికీ థాంక్యూ. ఈ సినిమాకి లాజిక్కులు అక్కర్లేదు. ఓన్లీ దైవత్వం. నెక్స్ట్ జనరేషన్ కి ఈ సినిమా ఒక గీత.  ప్రతి ఒక్కరిని దైవత్వంతో కనెక్ట్ చేసినందుకు బాలకృష్ణ గారికి బోయపాటి గారికి థాంక్యూ వెరీ హ్యాపీ.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.