నట సింహం నందమూరి బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన నాలుగో సినిమా అఖండ 2 బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. శనివారం కంటే ఆదివారం ఈసినిమా ఎక్కువ వసూళ్లను అందుకుందంటే ఏ రేంజ్ లో జోరు కొనసాగించిందో అర్ధం చేసుకోవచ్చు. ఫస్ట్ వీకెండ్ లో ఈసినిమా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 70కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టార్గెట్ లో సగానికి పైగా రికవరీ చేసింది.ముఖ్యంగా నైజాంలో ఈసినిమా అదరగొడుతుంది.నిన్నటితో అక్కడ 70 శాతం టార్గెట్ ను అందుకుంది. ఈవారంలో బ్రేక్ ఈవెన్ మార్క్ ను క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఈ ఏరియాలో ఈసినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు ఓవర్సీస్ లో ఈసినిమా 1 మిలియన్ మార్క్ కు చేరువలో వుంది. ఓవరాల్ గా అఖండ 2 ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి 3రోజుల్లో 90కోట్ల పైనే వసూళ్ళను రాబట్టుకుంది. సంక్రాంతి వరకు పెద్ద సినిమాల విడుదలేకపోవడం ,క్రిస్మస్ , న్యూ ఇయర్ సెలవులు ఉండడం అఖండ 2 లాంగ్ రన్ కి అడ్వాంటేజ్ కానుంది.
పవర్ ఫుల్ డివోషనల్ టచ్ తో పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమాలో సంయుక్త కథానాయికగా నటించగా హర్షాలి మల్హోత్రా కీలక పాత్రలో కనిపించింది.థమన్ సంగీతం అందించగా 14 రీల్స్ ప్లస్ నిర్మించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























