ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 2: ది రూల్ 1800కోట్ల పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈసినిమా ఇప్పుడు జపాన్‌లో కూడా విడుదల కానుంది.ఈ చిత్రం జనవరి 16, 2026న జపాన్ థియేటర్లలో విడుదల కానుంది. జపాన్‌లో ఈ సినిమాను ‘పుష్ప కున్రిన్’ అనే పేరుతో విడుదల చేస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి గీక్ పిక్చర్స్ మరియు షోచికు అనే డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని జపాన్ ప్రేక్షకులకు అందించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ప్రకటనతో పాటు, జపనీస్ ప్రేక్షకులకు స్వాగతం చెబుతూ “కొన్నిచివా, నిహోన్ నో తోమో యో” (హలో, స్నేహితులారా) అనే గ్రీటింగ్‌తో కూడిన ప్రత్యేకంగా డబ్ చేసిన జపనీస్ ట్రైలర్‌ను, కొత్త పోస్టర్లను కూడా విడుదల చేశారు.
ఈ సీక్వెల్ చిత్రం డిసెంబర్ 5, 2024న ఐదు భారతీయ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మించారు.ఇక ఇప్పుడు జపాన్ లో విడుదలకానున్న ఈసినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























