అఖిల్ రాజ్, తేజస్వి రావు జంటగా నటించిన రూరల్ కల్ట్ లవ్ స్టోరీ రాజు వెడ్స్ రాంబాయి బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని నమోదు చేస్తోంది. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ, ఈ సినిమాకు బలంగా లభించిన మౌత్ టాక్ కారణంగా కలెక్షన్లలో నిలకడ కనిపిస్తోంది. ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈసినిమా వీకెండ్ తర్వాత వచ్చిన మొదటి వర్కింగ్ డే (నాల్గవ రోజు, సోమవారం) కూడా ఈ సినిమా మంచి రన్‌ను కొనసాగించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఫలితంగా 4 రోజుల్లో మొత్తం గ్రాస్ వసూళ్లు 9.08 కోట్లకు పైగా చేరుకున్నాయి. ఫుల్ రన్ లో 15కోట్ల మార్క్ చేరుకొనే ఛాన్స్ లేకపోలేదు. అయితే ఈ గురువారం నుండి బాక్సాఫీస్ వద్ద రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా నుండి రాజు వెడ్స్ రాంబాయి కి గట్టి పోటీ ఎదురుకానుంది.
యధార్థ సంఘటనల ఆధారంగా సాయిలు కంపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో చైతన్య జొన్నలగడ్డ, శివాజీ రాజా, అనిత చౌదరి, శ్రీరంగం తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఈటీవీ విన్ ప్రొడక్షన్ హౌస్ సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి ఈ చిత్రాన్ని నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని విడుదల చేశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























