ఓటీటీలోకి రానున్న మాస్ జాతర

Mass Jathara All Set for Its OTT Release

మిస్టర్ బచ్చన్ తరువాత మాస్ మహా రాజా రవితేజ గత నెల చివర్లో మాస్ జాతరతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తనకు ఇది 75వ సినిమా.అయితే మంచి అంచనాల మధ్య ఈసినిమా అనుకున్న విజయాన్ని సాధించలేకపోయింది.ఇక ఈసినిమా ఓటీటీ లోకి వచ్చేస్తుంది. ఈనెల 28న మాస్ జాతర ను నెట్ ఫ్లిక్స్ అన్ని భాషల్లో స్ట్రీమింగ్ లోకి తీసుకురానునట్లు అధికారికంగా ప్రకటించింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భాను భోగవరపు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించగా తనకు జంటగా శ్రీలీల నటించింది. వీరిద్దరూ జంటగా నటించడం ఇది రెండో సారి.ఇంతకుముందు వీరి కాంబోలో ధమాకా రాగ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.మాస్ జాతర ను నాగవంశీ,సాయి సౌజన్య నిర్మించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు.

ఇక ఈసినిమా తరువాత రవితేజ నెక్స్ట్ భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాతో రానున్నాడు.షూటింగ్ కూడా ఫైనల్ కు చేరుకుంది.రీసెంట్ గా విడుదలైన గ్లింప్స్, సినిమాపై అంచనాలను పెంచేసింది.రవితేజ ఈసారి ఫ్రెష్ కంటెంట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా వస్తున్నాడు.మరి ఈసినిమాతోనైనా హిట్ కొట్టి ఫామ్ లోకి వస్తాడో చూడాలి.కిషోర్ తిరుముల డైరెక్ట్ చేస్తుండగా ఆషికా రంగనాథ్ ,డింపుల్ హయతి హీరోయిన్లు గా నటిస్తున్నారు.సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈసినిమా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.