ఇస్మార్ట్ శంకర్ తరువాత మళ్ళి ఆ రేంజ్ హిట్ కోసం చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నాడు ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని. ఇక ఈ హీరో మరో రెండు రోజుల్లో లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా తో రానున్నాడు. సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం ,ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడం తో ఈ సినిమాపై పాజిటివ్ బజ్ వుంది. రామ్ కూడా ఈసినిమా కోసం చాలా కేర్ తీసుకుంటున్నాడు. గతంలో తను నటించిన ఏ సినిమాను ప్రమోట్ చేయని విధంగా ఆంధ్ర కింగ్ తాలూకా ను ప్రమోట్ చేస్తూ విజయంపై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి.ఎలాంటి టికెట్ హైక్ లేకుండా అందుబాటు ధరల్లో థియేటర్లోకి వస్తుంది. నైజాంలో అయితే టికెట్ రేట్ తగ్గించారు. సింగిల్ స్క్రీన్ లలో 150, 100 రేట్లతో అందుబాటులోకి రానుంది. హిట్ టాక్ వస్తే జనాలు థియేటర్లకు రావడం ఖాయం.
ఈసినిమాను మహేష్ బాబు పి డైరెక్ట్ చేయగా భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించింది.ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. రావు రమేష్, మురళీ శర్మ, సత్య, రాహుల్ రామకృష్ణ, వీటీవీ గణేశ్ ముఖ్య పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించింది.మరి ఈసినిమా తో రామ్ కం బ్యాక్ ఇస్తాడో చూడాలి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























