రాజు వెడ్స్ రాంబాయి బ్రేక్ ఈవెన్ కంప్లీట్

Raju Weds Rambai 3 days collections

యంగ్ హీరో అఖిల్ రాజ్, సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ తేజస్వి రావు జంటగా నటించిన విలేజ్ కల్ట్ లవ్ స్టోరీ ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. మౌత్ టాక్ బాగుండడం తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా కలెక్షన్లను సొంతం చేసుకుంటుంది. మొదటి మూడు రోజుల్లో 7.28 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకుందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దాంతో మొదటి వారాంతంలోనే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ క్రాస్ చేసి లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటి రెండు రోజులు టికెట్ రేట్స్ తగ్గించడం సినిమాకు కలిసొచ్చింది. మరి ముందు ముందు ఈసినిమా ఎలాంటి రన్ ను కొనసాగిస్తుందో చూడాలి.

రూరల్ బ్యాక్ డ్రాప్ లో యధార్థ సంఘటనల ఆధారంగా సాయిలు కంపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈచిత్రంలో చైతన్య జొన్నలగడ్డ, శివాజీ రాజా, అనిత చౌదరి, శ్రీరంగం తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈటీవీ విన్ ప్రొడక్షన్ హౌస్ సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాస్ ఈ చిత్రాన్ని విడుదల చేశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.