ఆంధ్ర కింగ్ తాలూకా నా కెరీర్ లో గర్వపడే సినిమా – రామ్ పోతినేని

Andhra King Thaluka Is a Proud Milestone in My Career says Ram Pothineni

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ ఎవైటెడ్ యూనిక్ ఎంటర్‌టైనర్ ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ తో అలరించబోతున్నారు. పాన్ ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహేశ్ బాబు పి దర్శకత్వం వహిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుండగా, కన్నడ సూపర్‌స్టార్ ఉపేంద్ర ఆన్-స్క్రీన్ సూపర్‌స్టార్ పాత్రను పోషిస్తున్నారు. వివేక్ & మెర్విన్ స్వరపరిచిన ఈ సినిమా సంగీతం ఇప్పటికే అందరినీ ఆకట్టుకుంది, పాటలు చార్ట్‌బస్టర్‌లుగా మారాయి. ట్రైలర్ సినిమాపై అంచనాలని భారీగా పెంచింది. ఈ చిత్రం నవంబర్ 27న థియేటర్లలోకి వస్తుంది. ఈ సందర్భంగా మేకర్స్ వైజాగ్ లో మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. ఈ లైవ్ మ్యూజిక్ కాన్సర్ట్ లో రామ్ మైండ్ బ్లోయింగ్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ అందరినీ మెస్మరైజ్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మ్యూజిక్ కాన్సర్ట్ లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ.. హలో వైజాగ్. నా కెరీర్ లో గర్వపడే సినిమా ఆంధ్ర కింగ్ తాలూకా. ఈ సినిమా ఇంత బ్యూటిఫుల్ గా రావడానికి చాలా మంది కష్టం ఉంది. రవి గారు నవీన్ గారు చాలా పాషన్ వున్న ప్రొడ్యూసర్స్. డిఓపి జార్జ్ సిద్ధార్థ ఫెంటాస్టిక్ విజువల్స్ ఇచ్చారు. వివేక్ మార్విన్ తెలుగు సినిమాకి ఒక కొత్త సౌండ్ తీసుకొచ్చారు. ఈ ఆల్బమ్ గుండెల్లో నిలిచిపోతుంది. ఇది వారి ఆరంభం మాత్రమే. తెలుగు ఇండస్ట్రీకి చాలా రోజుల తర్వాత గ్లామర్ తో పాటు మంచి పర్ఫార్మ్ చేసే హీరోయిన్ భాగ్యశ్రీ వచ్చింది. ఇటీవల వచ్చిన సినిమాలో కూడా అతను అద్భుతమైన పర్ఫామెన్స్ ఇచ్చింది. ఏదైనా కొత్తగా చేయాలనుకున్నప్పుడు మహేష్ నా జీవితంలోకి వచ్చాడు. తనతో వర్క్ చేయడం మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. మహేష్ లాంటి హానెస్ట్ ఫిలిం మేకర్స్ తెలుగు సినిమాకి కావాలి. తను మరి ఎంతో గొప్ప స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నాను. పాతికేళ్ల క్రితం చనిపోవాలనుకున్న ఓ వ్యక్తి, ఉపేంద్ర గారి సినిమా చూసి తన మనసు మార్చుకుని ధైర్యంగా నిలబడి ఒక కంపెనీ పెట్టి వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. అది ఒక సినిమాకి ఒక అభిమానానికి ఉన్న శక్తి. ఉపేంద్ర గారితో కలిసి పనిచేయడం ఒక గౌరవంగా భావిస్తున్నాను. మై డియర్ ఫ్యాన్.. జీవితంలో పైకి రావాలంటే పాషన్, పర్పస్ ఉండాలి. నా పర్పస్ మీరే. రెండు ఇక్కడ టన్నులు టన్నులు ఉంది. వస్తున్నాం.. లెగుస్తున్నాను.. మళ్ళీ కొడుతున్నాం. హోంమంత్రి గారికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అభిమానులందరికీ ధన్యవాదాలు. ఆంధ్ర కింగ్ తాలూకా 27న రిలీజ్ అవుతుంది. అందరం థియేటర్స్ లో కలుద్దాం.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.